హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి శాఖకు చెందిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC).. ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం 538 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 432 ఖాళీలు
డిప్లొమా ఇంజనీరింగ్: 79 ఖాళీలు
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్: 27 ఖాళీలు
ప్రధాన వివరాలు:
విభాగాలు: మెకానికల్, కెమికల్, మెటలార్జికల్, ఈసీఈ, సీఎస్ఈ, సివిల్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడ్లలో ITI, డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్: ఐటీఐ పోస్టులకు నెలకూ రూ.10,560 – రూ.11,040; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఐటీఐ అభ్యర్థులు NAPS (www.apprenticeshipindia.gov.in) పోర్టల్ ద్వారా, డిప్లొమా/గ్రాడ్యుయేట్ అభ్యర్థులు NATS (https://nats.education.gov.in) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ: 16-09-2026.
హైదరాబాద్ ఎన్‌ఎఫ్‌సీలో 538 అప్రెంటిస్ ఖాళీలు







