ఆరోగ్యశాఖలోని 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎమ్‌పీహెచ్‌ఏ ఫీమేల్) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు.
ఈ అభ్యర్థులకు సెప్టెంబరు 16 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’లో ధ్రువపత్రాల పరిశీలన (వెరిఫికేషన్) నిర్వహించనున్నారు.
‘ఎమ్‌పీహెచ్‌ఏ’ ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల







