నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ఢిల్లీ (NBT) హెడ్ ఆఫీస్ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 11 (కన్సల్టెంట్ గ్రేడ్-I/II, లిటరరీ/కల్చరల్ క్యూరేటర్, కంటెంట్ రైటర్, యంగ్ ప్రొఫెషనల్, యాంకర్/ఎమ్సీ, హిందీ అధికారి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అడ్మిన్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్).
అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టును బట్టి 32 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు ఉంటుంది.
వేతనం: పోస్టును బట్టి నెలకు ₹24,365 నుండి ₹2,00,000 వరకు చెల్లిస్తారు.
కన్సల్టెంట్ గ్రేడ్-II: ₹1,45,000 – ₹2,00,000
కన్సల్టెంట్ గ్రేడ్-I: ₹80,000 – ₹1,25,000
క్యూరేటర్ పోస్టులు: ₹60,000 – ₹70,000
కంటెంట్ రైటర్/అడ్మిన్ ఎగ్జిక్యూటివ్: ₹40,000 – ₹50,000
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 2026 సెప్టెంబరు 10. వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడగలరు.
నేషనల్ బుక్ ట్రస్ట్‌లో కన్సల్టెంట్ సహా పలు ఉద్యోగాలు







