ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంకు(RRB)ల్లో ‘కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP RRBs XV)’ ద్వారా 13,706 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-ఎ ఆఫీసర్లు (స్కేల్-I, II, III), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 13,706
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 8,183
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 4,256
ఆఫీసర్ స్కేల్-II & III ఇతర పోస్టులు: 1,267
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
ఆఫీస్ అసిస్టెంట్: 18 – 28 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-I: 18 – 30 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-II: 21 – 32 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-III: 21 – 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: SC/ST/PWD అభ్యర్థులకు ₹175, మిగతా వారికి ₹850.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు: 01-09-2026 నుంచి 21-09-2026 వరకు.
ప్రిలిమినరీ పరీక్ష: నవంబరు / డిసెంబరు 2026.
మెయిన్స్ / సింగిల్ పరీక్ష: జనవరి 2027.
అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఐబీపీఎస్ ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ







