స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,748 జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో నియమిస్తారు.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా లేదా సంబంధిత కోర్సుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక విధానం జరుగుతుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 22వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
డిప్లొమా, డిగ్రీతో 1,748 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు







