మేనేజ్మెంట్, టెక్నాలజీ కోర్సులు చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ‘బజాజ్ ఫిన్సర్వ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ FY 2026-27’ ప్రకటించబడింది. ఈ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏటా గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది.
అర్హతలు:
2026-27 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం MBA/PGDM/PGP లేదా B.E/B.Tech, M.E/M.Tech (CS, IT, AI/ML, Data Science, Statistics) కోర్సుల్లో చేరినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
10వ తరగతి మరియు 12వ తరగతిలో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి.
టాప్ 25 NIRF ర్యాంక్ సాధించిన కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు (టాప్ 10 కళాశాలల వారికి మరింత ప్రాధాన్యం).
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 15 లక్షలకు మించకూడదు.
ఆసక్తి గల విద్యార్థులు అక్టోబర్ 5, 2026 నాటికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
బజాజ్ ఫిన్సర్వ్ స్కాలర్షిప్: ఏటా గరిష్టంగా రూ. 10 లక్షల ఆర్థిక సాయం!







