Trending Posts

దిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ లో 1,871 ఎస్ఐ ఉద్యోగాలు

​స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)… దిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) లలో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2026 ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దిల్లీ పోలీస్ విభాగంతో పాటు సీఏపీఎఫ్ లోని బిఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ సంస్థలలో మొత్తం 1,871 సబ్-ఇన్‌స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
​ఇందులో సీఏపీఎఫ్ ఎస్ఐ (జీడీ) 1,320, దిల్లీ పోలీస్ ఎస్ఐ (ఎగ్జిక్యూటివ్-పురుషులు) 205, దిల్లీ పోలీస్ ఎస్ఐ (మహిళలు) 112 మరియు సీఏపీఎఫ్ ఎస్ఐ (ఫైర్-పురుషులు) 234 పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్ఐ (ఫైర్) పోస్టుకు సైన్స్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి. దిల్లీ పోలీస్ ఎస్ఐ (పురుషులు) పోస్టులకు ఎల్‌ఎమ్‌వీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
​అభ్యర్థుల వయోపరిమితి 01.08.2026 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. సీబీటీ రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష (పీఈటీ/పీఎస్‌టీ), మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు జీతం లభిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 10 నుంచి 30, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.100 కాగా, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/