ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఉద్యోగాలు సాధించే సువర్ణావకాశం లభించింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) 2026 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 2,536 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు & వేతనం:
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA): లెవెల్-2 మూలవేతనం ₹19,900 (మొత్తం వేతనం సుమారు ₹40,000).
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO): లెవెల్-4 మూలవేతనం ₹25,500 (మొత్తం వేతనం సుమారు ₹50,000) మరియు కొన్ని విభాగాటోని లెవెల్-5 పోస్టులకు ₹29,200 మూలవేతనం (మొత్తం వేతనం సుమారు ₹60,000).
ముఖ్యమైన అర్హతలు:
విద్యా అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. కొన్ని కేటగిరీల DEO పోస్టులకు ఇంటర్లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-08-2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి (02.08.1999 నుండి 01.08.2008 మధ్య జన్మించాలి). ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ టైర్-1, టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మరియు స్కిల్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.
టైర్-1: 200 మార్కులకు (100 ప్రశ్నలు, వ్యవధి 1 గంట) ఆన్లైన్లో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ (0.50 మార్కులు) వర్తిస్తుంది.
టైర్-2: 4 సెక్షన్లుగా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ పరిజ్ఞానంపై పరీక్ష నిర్వహిస్తారు. తుది నియామకాలు టైర్-2 మార్కుల ఆధారంగానే ఉంటాయి.
దరఖాస్తు సమాచారం:
చివరి తేదీ: ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబరు 07, 2026 రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు రుసుము: ₹100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు).
వెబ్సైట్: అధికారిక సమాచారం మరియు దరఖాస్తుల కోసం https://ssc.gov.in/ చూడవచ్చు.
ఇంటర్ విద్యార్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల!







