ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు-2027కు హాజరయ్యే విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా బోర్డు పరీక్షా ఫీజు షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2026 సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 29 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు తమ కళాశాలల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత రూ. 1,000 ఆలస్య రుసుముతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ గడువు ముగిసిన తర్వాత ఫీజు చెల్లింపు తేదీలను పొడిగించేది లేదని బోర్డు స్పష్టం చేసింది.
ఫీజు వివరాలు:
ఫస్ట్ ఇయర్ థియరీ: ₹600
సెకండ్ ఇయర్ థియరీ: ₹600
ఫస్ట్ + సెకండ్ ఇయర్ థియరీ: ₹1,200
సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్: ₹275
బ్రిడ్జ్ కోర్సు: ₹165
ఆలస్య రుసుము పడకుండా విద్యార్థులు ముందే ఫీజు చెల్లించాలని బోర్డు సూచించింది.
AP ఇంటర్ పరీక్షలు 2027 ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల!







