Trending Posts

​హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 మేనేజర్ ఉద్యోగాలు

​తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ​ఖాళీలు ఇందులో సివిల్ విభాగంలో 104, ఎలక్ట్రికల్/మెకానికల్‌లో 19, CSE/IT/ECE విభాగాలలో 7 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నవారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది). ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుండి రూ.1,33,630 వరకు జీతం లభిస్తుంది. మొత్తం 450 మార్కులకు నిర్వహించే రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబరు 17 వ తేది వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష డిసెంబర్ 2026లో హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో జరిగే అవకాశం ఉంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/