ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత, వృత్తి విద్యా కోర్సులను అభ్యసించడానికి ఎల్.ఐ.సి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ (LIC GJF) “గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2026” నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంపికైన విద్యార్థులకు ఏటా రూ.15,000 నుండి రూ.50,000 వరకు ఆర్థిక సాయం అందిస్తారు. మెడిసిన్ కోర్సులకు రూ.50,000, ఇంజినీరింగ్‌కు రూ.40,000, డిగ్రీ/డిప్లొమా/ఐటీఐ కోర్సులకు రూ. 20,000 చొప్పున సంవత్సరానికి రెండు విడతల్లో (NEFT ద్వారా) చెల్లిస్తారు.
పదో తరగతి తర్వాత ఇంటర్, ఒకేషనల్ లేదా డిప్లొమా చేరే విద్యార్థులకు ఏటా రూ.15,000 అందిస్తారు.
అభ్యర్థులు 10వ తరగతి లేదా ఇంటర్/తత్సమాన పరీక్షల్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4,50,000 మించకూడదు. ఆసక్తి గల అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ (licindia.in) ద్వారా కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి 2026 అక్టోబర్ 15 చివరి తేదీ.
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2026








