మొత్తం 4,029 జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలార్జికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల రివైజ్డ్ తేదీలను ఆర్‌ఆర్‌బీ (RRB) ప్రకటించింది. మునుపు ప్రకటించిన తేదీల్లో మార్పులు చేస్తూ, అక్టోబరు 27, 28 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎస్ అండ్ టీ, స్టోర్ వంటి విభాగాల్లో 3,994 జేఈ, డీఎమ్‌ఎస్ పోస్టులు మరియు 35 కెమికల్ & మెటలార్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఒక్క సికింద్రాబాద్ జోన్‌లోనే 111 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా/ఇంజినీరింగ్/బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అక్టోబరు 27, 28 తేదీల్లో ఆర్‌ఆర్‌బీ జేఈ పరీక్షలు







