ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న 40 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) బ్రీఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 06, 2026 నుండి అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ (https://psc.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి, విద్యార్హతలు, జీతభత్యాల వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబర్ 6 లేదా అంతకంటే ముందే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఈ పోస్టుల ఎంపిక కోసం ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-I (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), పేపర్-II (కామన్ సబ్జెక్ట్) ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది.
AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 40 AEE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్







