ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ( KGBV) పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 299 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో 16 ప్రిన్సిపల్, 98 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, 133 కాంటాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, 52 ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 50% మార్కులతో డిగ్రీ, బీఈడీ, పీజీ తోపాటు ఏపీ టెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలు మించి ఉండరాదు. ఎస్సీ, ఎస్టి, బిసి, ఈ డబ్ల్యూ ఎస్ వారికి 50 ఏళ్లు, దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు అవకాశం ఉంది. ప్రిన్సిపాల్ కు, రూ.34, 139, ఇతర పోస్టులకు రూ. 26,759 వేతనం చెల్లిస్తారు. జూన్ 5వ తేదీ 2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. విద్యార్హతలు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
AP KGBV లో ఉద్యోగ అవకాశాలు







