న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కి చెందిన ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (TKDL) యూనిట్ 50 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్-I ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఆయుర్వేద, యూనాని, సిద్ధ, పేటెంట్, సంస్కృతం, యోగా తదితర విభాగాలలో అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి B.E/B.Tech/MCA లేదా సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు అర్హులు. వయోపరిమితి పోస్టును బట్టి 35 నుంచి 40 ఏళ్ల వరకు కేటాయించారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు ₹25,000 నుండి ₹42,000 వరకు వేతనంతో పాటు HRA లభిస్తుంది. ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులు. ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీ, హైదరాబాద్, జమ్మూ, చెన్నై మొదలైన ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు వెంటనే www.csir.res.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.
CSIR లో 50 ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు సమయం!







