ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) భోపాల్, జనవరి 2027 సెమిస్టర్ కోసం ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు IISER భోపాల్ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో MSc లేదా BTech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్‌లో 7.0 CGPA సాధించి ఉండటం తప్పనిసరి. నిబంధనల ప్రకారం SC, ST, PwD, OBC-NCL, EWS కేటగిరీల అభ్యర్థులకు అర్హత మార్కుల్లో 5 నుండి 10 శాతం వరకు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు CSIR-UGC JRF, NET (LS), GATE లేదా JEST వంటి జాతీయ స్థాయి పరీక్షలలో అర్హత సాధించి ఉండాలి. అలాగే DST-INSPIRE పీహెచ్‌డీ ఫెలోషిప్ ఉన్న అభ్యర్థులు కూడా ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన వివరాలు, పత్రాలతో 12 అక్టోబర్ 2026 నాటికి తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
IISER భోపాల్‌లో ఫిజిక్స్ పీహెచ్‌డీ అడ్మిషన్లు ప్రారంభం







