పార్వతీపురంలోని గాయత్రీ డిగ్రీ కాలేజీలో అక్టోబర్ 8, 2026న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని మొత్తం 1,060 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఫ్లిప్‌కార్ట్, ఫాక్స్‌కాన్, హెటెరో, కియా మోటార్స్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. కియా మోటార్స్‌లో అత్యధికంగా 500 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు: 8వ తరగతి, 10వ తరగతి నుంచి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, ఎంఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాకు హాజరుకావచ్చు. ఫ్రెషర్లతో పాటు అనుభవం ఉన్న వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.
హాజరయ్యే విధానం: ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, రెజ్యూమ్‌తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. మరిన్ని వివరాలకు 7382559022 నంబర్‌ను సంప్రదించవచ్చు.
గాయత్రీ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా.. 1,060 ఉద్యోగాలు!







