తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( TET ) -2026 మొదటి విడత హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను tgtet.aptonline.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష కోసం లక్ష 36 వేల 418 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ – 1 కు 32,779, పేపర్ – 2 కి 86,305 మంది, రెండు పేపర్లకు కలిపి 17, 334 మంది దరఖాస్తు చేసుకున్నారు . వీరిలో 28, 149 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం ఉన్నారు. ఈసారి టెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. మొత్తం పది సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు నెంబర్, జనరల్ నెంబర్, మొబైల్ నెంబర్ , పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డు పొందవచ్చు. ఏదైనా తప్పులు ఉంటే టెట్ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు హాల్ టికెట్ ప్రింట్ అవుట్ తో పాటు దానిపై పాస్ ఫోటో సైజ్ ఫోటోను అతికించి, ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ( ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్) ఒరిజినల్ వెంట తెచ్చుకోవాలి. జూన్16 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
అందుబాటులో TET హాల్ టికెట్







