Trending Posts

19 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడు విడుతల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత జూలై 14, రెండో విడత జులై 19, మూడో విడత జూలై 29న ముగుస్తుంది. తొలి విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ జూన్ 19 నుంచి 28 వరకు చేసుకోవాలి. జూన్ 22 నుంచి 29 వరకు ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. జూన్ 25 నుంచి జూలై 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ ప్రక్రియ ఉంటుంది. జూలై 4వ తేదీ వరకు మాక్ సీట్లు కేటాయిస్తారు. జులై 5 నుంచి 7 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంది. జులై 10వ తేదీ వరకు సీట్లు కేటాయిస్తారు. జులై 18 నుంచి 22 వరకు సెల్ఫ్ రిపోర్టు, ఫీల్ చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం 2, 3 విడతల కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈసారి కన్వీనర్, మేనేజ్మెంట్ సీట్లను ఒకేసారి భర్తీ చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/