ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) భాగస్వామ్యంతో మెగా జాబ్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఇగ్నో విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల (Alumni) కోసం సర్వీసెస్ సెక్టార్లో ఈ అవకాశాలను కల్పిస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 17 మరియు 18వ తేదీల్లో (గురు, శుక్రవారాలు) ఉదయం 10:00 గంటలకు న్యూఢిల్లీలోని ‘B.R. అంబేడ్కర్ కన్వెన్షన్ సెంటర్, IGNOU క్యాంపస్, మైదాన్ గర్హి’ వేదికగా జరగనున్నాయి.
యాక్సిస్ బ్యాంక్, Samsung, Cogent, Ather, Tata Play, Energizer, 1Point1 Solutions వంటి ప్రముఖ సంస్థలు ఈ డ్రైవ్‌లో పాల్గొంటున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ NCR పరిధిలో ఉద్యోగాలు లభిస్తాయి. పోస్టులను బట్టి నెలకు రూ. 35,000 వరకు జీతంతో పాటు ఇన్సెంటివ్‌లు ఉంటాయి.
UG, PG, B.Com, BBA, M.Com, B.Sc, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు హాజరుకావచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అప్డేటెడ్ రెజ్యూమ్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్, విద్యా అర్హతల సర్టిఫికెట్లు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
ఇగ్నోలో మెగా జాబ్ డ్రైవ్: ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు, రూ. 35,000 వరకు జీతం







