Trending Posts

APPSC కీలక అప్‌డేట్: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల పరీక్షా తేదీలు ఖరారు

​ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ (APPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే స్క్రీనింగ్ / రాత పరీక్షల (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – CBT) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలోని 19 విశ్వవిద్యాలయాలు జారీ చేసిన నోటిఫికేషన్ల ఆధారంగా ఈ నియామక ప్రక్రియ సాగుతోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2026 డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో విస్తృతంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. సబ్జెక్టుల వారీగా పరీక్షల సమయాలు, పూర్తి షెడ్యూల్ వివరాల కోసం అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/