స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇంటర్‌మీడియట్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం. జూనియర్ ఇంజినీర్, సీహెచ్‌ఎస్‌ఎల్, ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ ఎస్‌ఐ వంటి ప్రధాన విభాగాల్లో మొత్తం 6,155 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
పోస్టుల వివరాలు:
జూనియర్ ఇంజినీర్ (JE): 1,748 పోస్టులు
సీహెచ్‌ఎస్‌ఎల్ 2026 (LDC / DEO): 2,536 పోస్టులు
ఢిల్లీ పోలీస్ & సీఏపీఎఫ్ ఎస్‌ఐ: 1,871 పోస్టులు
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జేఈ, సీహెచ్‌ఎస్‌ఎల్, సీఏపీఎఫ్ ఎస్‌ఐ నోటిఫికేషన్లు విడుదల: మొత్తం 6,155 ఖాళీలు







