Trending Posts

డీఆర్‌డీఓ- ఏడీఏలో 111 ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు

బెంగళూరులోని రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) తాత్కాలిక ప్రాతిపదికన 111 ‘ప్రాజెక్ట్ అసిస్టెంట్-I’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
​విభాగాల వారీగా ఖాళీలలో కంప్యూటర్ సైన్స్ (15), ఎలక్ట్రికల్ & కమ్యూనికేషన్ (20), ఏరోనాటికల్ (10), ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ (20), మెకానికల్ (43), మెటలర్జీ (01), సివిల్ (02) ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి.
​అర్హతలు బీఈ/బీటెక్, ఎంఈ/ఎమ్‌టెక్, బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తి చేసి, గేట్ (GATE) లేదా నెట్ (NET) స్కోర్ కలిగి ఉండాలి.
వయోపరిమితి 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్ బీఈ/బీటెక్ అభ్యర్థులకు నెలకు రూ. 31,000, ఇతరులకు రూ. 37,000 చెల్లిస్తారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 13 వరకు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/