చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) ఖాళీగా ఉన్న 243 నర్సింగ్ ఆఫీసర్ (గ్రూప్-బి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న భారతీయ పౌరులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 3, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
B.Sc Nursing / Post Basic B.Sc Nursing ఉత్తీర్ణత లేదా ఏడాది క్లినికల్ అనుభవంతో పాటు డిప్లొమా నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన వారికి నెలవారీ వేతనం రూ. 44,900 నుండి రూ. 1,42,400 వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము జనరల్/OBCలకు రూ. 1,500; SC/ST/EWSలకు రూ. 800; PwBD అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మరియు సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు మరిన్ని వివరాలకు pgimer.edu.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
PGIMERలో 243 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు: రూ.1.42 లక్షల వరకు జీతం







