భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు (ICRB) ద్వారా సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తు గడువు సెప్టెంబరు 16తో ముగియనుంది.
పోస్టులు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో మొత్తం 175 ఖాళీలు ఉన్నాయి.
అర్హత సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వేతనం నెలకు మూలవేతనం ₹56,100తో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రేపటి (సెప్టెంబరు 16) లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇస్రో-ఐసీఆర్బీలో 175 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులు.. రేపే దరఖాస్తుకు చివరి తేదీ!







