Trending Posts

APPSC నుండి 20 నోటిఫికేషన్లు విడుదల. ఖాళీల వివరాలు మరియు దరఖాస్తు తేదీలు!

​ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 20 బ్రిఫ్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
​ముఖ్యమైన ఖాళీలు గ్రూప్-1 సర్వీసెస్: 163 పోస్టులు
​అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO): 196 పోస్టులు
​ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III (ఎండోమెంట్స్): 104 పోస్టులు
​ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్: 78 పోస్టులు
​హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (BC/Social/Tribal Welfare): 73 పోస్టులు
​అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్: 40 పోస్టులు
​హోర్టికల్చర్ ఆఫీసర్: 37 పోస్టులు
​ఇతర విభాగాల్లో (ఫారెస్ట్ ఆఫీసర్స్, సూపర్‌వైజర్ గ్రేడ్-1, అనలిస్ట్ మొదలైనవి) పలు ఖాళీలు కలవు.
​వివిధ పోస్టులకు దరఖాస్తు తేదీలు అక్టోబర్ 06, 2026 నుండి దశలవారీగా ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. గ్రూప్-1, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, హోర్టికల్చర్ ఆఫీసర్: అక్టోబర్ 06 నుండి అక్టోబర్ 27 వరకు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అక్టోబర్ 09 నుండి అక్టోబర్ 29 వరకు.
​ASO, ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ అక్టోబర్ 13 నుండి నవంబర్ 02 వరకు.
​ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ అక్టోబర్ 16 నుండి నవంబర్ 05 వరకు.
​పూర్తి స్థాయి నోటిఫికేషన్లు మరియు సవివరమైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ను సందర్శించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/