Trending Posts

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ 480 ఖాళీలతో UPSC ESE 2027 నోటిఫికేషన్

​యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-‘ఎ’, గ్రూప్-‘బి’ పోస్టుల భర్తీకి ప్రతిష్టాత్మక ‘ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE 2027)’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఇందులో 19 పోస్టులు దివ్యాంగులకు (PwBD) కేటాయించారు.
​సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మరియు ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో బి.ఇ/బి.టెక్ (B.E/B.Tech) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జనవరి 1, 2027 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).
​ప్రిలిమినరీ పరీక్ష (31 జనవరి 2027)
​మెయిన్ పరీక్ష (18 జూన్ 2027)
​పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ
​ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసుకుని అక్టోబర్ 06, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/