Trending Posts

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)-2027 నోటిఫికేషన్ విడుదల

​దేశవ్యాప్తంగా ఉన్న 25 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలలో (NLUs) అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) లా ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించే ‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027’ నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ మరియు ఏడాది ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఐయు, హైదరాబాద్‌‌లోని నల్సార్, భోపాల్, కోల్‌కతా తదితర ప్రాంతాల్లోని 25 ప్రముఖ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఈ ప్రవేశ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ​యూజీ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో 10+2 (ఇంటర్‌మీడియట్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష పూర్తి చేసి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం ఆగస్టు 3, 2026.
​ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబరు 31, 2026.
​క్లాట్-2027 పరీక్ష తేదీ (ఆఫ్‌లైన్): డిసెంబర్ 6, 2026న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీలోగా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/