భారతదేశ రక్షణ పరిశోధన సంస్థ (DRDO) అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ కార్యక్రమం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్ పూర్తయిన గ్రాడ్యుయేట్ (B.Tech), టెక్నీషియన్ (Diploma) అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ వంటి కోర్సులు; టెక్నీషియన్ విభాగంలో సివిల్, ECE, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, సినిమాటోగ్రఫీ, ఆటోమొబైల్ వంటి రంగాలు అందుబాటులో ఉన్నాయి. 2022 నుండి 2026 మధ్య కాలంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన బి.టెక్ అభ్యర్థులకు నెలకు రూ. 12,300, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ. 10,900 స్టైపెండ్ అందిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 12, 2026 నాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
DRDO అప్రెంటిస్‌షిప్ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తుల ఆహ్వానం










